Home > CURRENT AFFAIRS > ATAL SETU – అతి పొడవైన సముద్రపు వంతెన

ATAL SETU – అతి పొడవైన సముద్రపు వంతెన

BIKKI NEWS (JAN. 13) : ముంబై – నవీ ముంబై లను కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవుతూ నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెనను అటల్ సేతు (ATAL SETU LONGEST SEA BRIDGE IN INDIA) ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు.

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) ముంబైలోని సేవ్రి, రాయగఢ్ జిల్లా నవా శేవాను కలుపుతుంది. రూ.21,200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిలోని పేరు మీదుగా ‘అటల్ సేతు’ అని నామకరణం చేశారు.

రెండు పాయింట్ల మధ్య ప్రస్తుతం ఉన్న గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయం ఈ వంతెన ద్వారా 20 నిమిషాలకు తగ్గుతుంది. ఆరు లైన్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి.. 16.5 కిలోమీటర్లు సముద్రం మీదుగానే వెళ్తుంది. బ్రిడ్జి ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య దూరం ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెనపై ఓపెన్ రోడ్ టోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహనదారులు టోల్ బూతుల వద్ద ఆగకుండానే 100 కిలో మీటర్ల వరకు వేగంతో వెళ్లిపోవచ్చు.