BIKKI NEWS : ASIAN GAMES 2023 INDIA MEDALS TALLY LIST సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరుగుతున్న ఆసియన్ గేమ్స్ 2023లో భారత క్రీడాకారులు మొత్తం 107 పతకాలతో రికార్డు సృష్టించారు. విజేతల జాబితా ను (INDIA TOTAL MEDALS TALLY IN ASIAN GAMES 2023 -) చూద్దాం…
ఆసియన్ గేమ్స్ చరిత్ర లో ఇన్ని పతకాలు సాదించడం ఇదే మొదటి సారి. 2018 జకర్తా లో జరిగిన ఆసియా గేమ్స్ లో 70 పతకాల సృష్టించిన రికార్డు ను ఈ సంవత్సరం మన ఆటగాళ్లు బద్దలు కొడుతూ 107 పతకాలతో సరికొత్త రికార్డు తో పారిస్ ఒలింపిక్స్ పై భారీ ఆశలు కల్పించారు..
మొత్తం పతకాలు – 107
బంగారు పతకాలు – 28
రజత పతకాలు – 38
కాంస్య పతకాలు – 41
INDIA MEDALS TALLY IN ASIAN GAMES 2023 – UPDATES
★ స్వర్ణ పథకాలు
1) షూటింగ్ పురుషుల టీమ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
2) మహిళల టీట్వంటీ క్రికెట్ జట్టు
3) ఈక్వేస్ట్రేయన్ మహిళల టీమ్
4) షూటింగ్ మహిళల టీమ్ 25 మీటర్ల పిస్టల్ : మను భాకర్, ఇశా సింగ్, సంగ్వాన్
5) మహిళల 50 మీటర్ల రైఫిల్ – 3 పోజిషన్ షూటింగ్ వ్యక్తిగత ఈవెంట్ భారత షూటర్ సిఫ్ట్ కౌర్ శర్మ స్వర్ణ పథకం నెగ్గింది.
6) సరబ్‌జోత్ సిఃగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ లతో కూడిన టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో స్వర్ణం సాదించారు.
7) పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పోజిషన్ షూటింగ్ టీమ్ ఈవెంట్ లో స్వప్నిల్ కుషాలే, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షెరోన్ లతో కూడిన టీమ్ ఈ ఈవెంట్ లో స్వర్ణం సాదించారు.
8) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో పలక్ స్వర్ణం సాదించింది.
9) టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్ లో రోహన్ బోపన్న, రుతుజ బోస్లే జోడి మొదటి స్థాయిలో నిలిచి స్వర్ణం నెగ్గింది.
10) స్క్వాస్ పురుషుల టీమ్ తరపున అభయ్ సింగ్, సౌరవ్ గోషల్, మహేష్, సంధూ హరిందర్ బృందం పాకిస్థాన్ పై 2-1 తేడాతో నెగ్గి బంగారు పథకం కైవసం చేసుకుంది.
11) పురుషుల షూటింగ్ ట్రాప్ టీమ్ ఈవెంట్ లో క్యానన్ చెనయ్, జోరావర్ సింగ్, పృధ్వీరాజ్ తొండైమాన్ ల బృందం స్వర్ణం నెగ్గింది.
12) అవినాష్ సాబ్లే కు 3000 మీటర్ల స్టిపుల్ ఛేజ్ లో స్వర్ణందక్కింది.
13) పురుషుల షాట్ పుట్ ఫైపల్ లో భారత ఆటగాడు తజీందర్ పాల్ సింగ్ తూర్ స్వర్ణ పథకం సాధించాడు.
14) మహిళల 5000 మీటర్ల పరుగులో భారత క్రీడాకారీణి ఫారుల్ చౌదరి కి స్వర్ణం దక్కింది.
15) మహిళల జావెలిన్ త్రో లో అన్ను రాణి స్వర్ణం నెగ్గింది.
16) అర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి, ఓజాస్ జోడి పసిడి పథకం గెలుచుకుంది.
17) జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా కు పసిడి పథకం.
18) పురుషుల 4× 400 రిలే పరుగులో భారత జట్టు స్వర్ణం గెలుచుకుంది.
19) అర్చరీ లో భారత క్రీడాకారులు జ్యోతి వెన్నం, అదితి, పరణితి ల బృందం స్వర్ణం గెలుచుకుంది.
20) స్క్వాస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో దీపికా పల్లికల్ , హరలాల్ సంధు లు స్వర్ణం సాదించారు.
21) పురషుల అర్చరీ టీమ్ ఈవెంట్ లో ఓజాస్, అభిషేక్, ప్రదమేష్ లు స్వర్ణం గెలిచారు.
22) పురుషుల హకీ జట్టు స్వర్ణం గెలుచుకుంది.
23) మహిళల అర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన జ్యోతి సురేఖ బంగారం గెలుచుకుంది.
24) పురుషుల అర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన ఓజాస్ బంగారం గెలుచుకున్నాడు
25) మహిళల కబడ్డీ జట్టు స్వర్ణం నెగ్గి భారత్ కు 100వ పథకాన్ని అందించింది.
26) బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడి పసిడి పతకం కైవసం చేసుకుంది
27) పురుషుల టీట్వంటీ క్రికెట్ లో టీమిండియా స్వర్ణం నెగ్గింది.
28) భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ పై సంచలన విజయం సాదించి స్వర్ణం నెగ్గింది.
★ రజత పథకాలు
1) రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ :- అర్జున్ లాల్ జాట్ & అర్వింద్ సింగ్ లకు రజతం
2) రోయింగ్ పురుషుల కాక్స్ డ్ – 8 విభాగం జట్టుకు రజతం
3) మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగం :- రమితా జిందాల్, మెహులీ ఘోష్, ఆసీ ఛోక్సీ లకు రజతం
4) సెయిలింగ్ లో GIRLS DINGHY ILCA 4 విభాగం :- నేహా ఠాకూర్
5) షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ – 3 పోజిషన్ :- ఆశి చోక్సీ, మానిని కౌశిక్, కౌర్ శర్మ
6) పురుషుల షూటింగ్ స్కీట్ వ్యక్తిగత విభాగంలో అనంత్ జీత్ సింగ్ రజతం నెగ్గాడు
7) షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఈశా సింగ్ రజతం నెగ్గింది.
8) వుషూ క్రీడలో రోషిబీనా దేవి మహిళల 60 కేజీల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజతం సాదించింది.
9) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ విభాగంలో ఈశా సింగ్, దివ్య తాడిగోల్, పలాక్ ల బృందం రజతం నెగ్గింది.
10) టెన్నిస్ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని, రామకృష్ణ రామనాథన్ ల జోడి రెండో స్థానంలో నిలిచి రజతం సాదించింది. ఇది భారత్ కు 10వ రజతం
11) మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈశా సింగ్ రజతం సాదించింది.
12) పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పోజిషన్ షూటింగ్ వ్యక్తిగత ఈవెంట్ లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ రజతం సాదించాడు.
13) షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య ల జోడి 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్ లో రెండో స్థానంలో నిలిచి రజతం సాదించారు.
14) 10, 000 మీటర్ల అథ్లెటిక్స్ లో కార్తీక్ కుమార్ రజతం గెలుచుకున్నాడు.
15) మహిళల వ్యక్తిగత గోల్ఫ్ లో అదితి ఆశోక్ రజతం నెగ్గింది. ఈ ఈవెంట్ లో ఇదే ఆసియన్ గేమ్స్ చరిత్రలో మొదటి పథకం కావడం విశేషం.
16) మహిళల షూటింగ్ ట్రాప్ టీమ్ ఈవెంట్ లో మనీషా కీర్, ప్రితీ రజాక్, రాజేశ్వరి కుమారి ల బృందం రజతం గెలుచుకుంది.
17) పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో భారత్ కు చెందిన అజయ్ కుమార్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించాడు.
18) మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో భారత్ కు చెందిన హర్మిలాన్ బెయిన్ రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సాధించింది.
19) పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్ లో భారత్ ఓటమి కారణంగా రజతం నెగ్గింది.
20) మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో జ్యోతి యర్రాజి రెండో స్థానంలో నిలిచి రజతం సాదించింది.
21) పురుషుల లాంగ్ జంప్ ఫైనల్ లో మురళి శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలుచుకున్నాడు.
22) మహిళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో భారత క్రీడాకారిణి ఫారుల్ చౌదరి కి రజతం దక్కింది.
23) మహిళల లాంగ్ జంప్ లో సోజన్ ఎడపిల్లే యాంకీ రజతంనెగ్గింది.
24) 4×400 మిక్స్‌డ్ రిలే పరుగు ఈవెంట్ లో అజ్మల్, రామరాజ్, శుభ, రాజేష్ లు రజతం నెగ్గారు.
25) పురుషుల 800 మీటర్ల ఫైనల్స్ లో రెండో స్థానంలో నిలిచిన మహ్మద్ అప్జల్ కు రజతం దక్కింది.
26) పురుషుల డెకథ్లాన్ లో తేజశ్విన్ శంకర్ కు రజతం దక్కింది.
27) మహిళల 75 కేజీల బాక్సింగ్ లో లవ్లీనా బోర్గహైన్ రజతం సాదించింది.
28) పురుషుల 5000 మీటర్ల పరుగులో అవినాష్ సాబ్లే కు రజత పథకం గెలుచుకున్నాడు. ఇది సాబ్లే కి ఈ గేమ్స్ లో రెండో పథకం.
29) మహిళల 800 మీటర్ల పరుగులో హర్మిలాన్ బెయిన్ రజతం నెగ్గింది. హర్మిలాన్ కు ఈ గేమ్స్ లో ఇది రెండో రజతం.
30) జావెలిన్ త్రో లో కిశోర్ కుమార్ జెనా కు రజతం దక్కింది.
31) మహిళల 4× 400 రిలే పరుగులో భారత జట్టు రజతం గెలుచుకుంది.
32) స్క్వాస్ పురుషుల సింగిల్స్ లో సౌరవ్ ఘోషల్ కు రజతం దక్కింది.
33) పురుషుల అర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్ లో అటను, ధీరజ్, తుషార్ ల బృందం రజతం సాదించింది.
34) పురుషుల బ్రిడ్జి టీమ్ రజతం గెలుచుకుంది.
35) పురుషుల అర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన అభిషేక్ రజతం గెలుచుకున్నాడు.
36) పురుషుల 86 కేజీల రెజ్లింగ్ ప్రీ స్టైల్ ఈవెంట్ లో దీపక్ పూనియా రజతం సాధించాడు.
37) పురుషుల టీమ్ చెస్ క్రీడలో రజతం సాదించింది.
38) మహిళల టీమ్ చెస్ క్రీడలో రజతం సాదించింది
★ కాంస్య పథకాలు
1) షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగం :- రమితా జిందాల్
2) రోయింగ్ పురుషుల కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్ :- బాబులాల్ యాదవ్ & లేక్ రామ్
3) రోయింగ్ పురుషుల జట్టు కాక్స్ డ్ – 4 విభాగం :- సత్నామ్ సింగ్, పరమిందర్ సింగ్, సుఖ్‌మిత్ & జఖార్ ఖాన్
4) పురుషుల షూటింగ్ 25 మీటర్ల ఫైర్ రాఫిడ్ ఫిస్టల్ టీమ్ విభాగం :- అనీష్ – విజయ్ వీర్ – ఆదర్శ్
5) పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగం :- ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్
6) సెయిలింగ్ లో RS X MEN విభాగం :- ఎబాద్ అలీ
7) రోయింగ్ పురుషుల జట్టు కాక్స్ డ్ – 4 విభాగం :- . జశ్వీంధర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశీష్.
8) మహిళల 50 మీటర్ల రైఫిల్ – 3 పోజిషన్ షూటింగ్ వ్యక్తిగత ఈవెంట్ లో అసీ చౌక్సీ (ashi chouksey) కాంస్యం పథకం నెగ్గింది.
9) సెయిలింగ్ పురుషుల డింగీ ILCA7 వ్యక్తిగత విభాగంలో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు.
10) పురుషుల షూటింగ్ స్కీట్ టీమ్ విభాగంలో గురుజ్యోత్, అనంత్‌జీత్, అంగడ్‌వీర్ల బృందం కాంస్యం నెగ్గింది.
11) ఈక్వేస్ట్రేయన్ పురుషుల వ్యక్తిగత డ్రెస్సేజ్ ఈవెంట్ లో అనూస్ అగర్వాల్లా మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు. ఈ విభాగంలో చరిత్రలో వ్యక్తిగత కాంస్యం నెగ్గిన తొలి ఆటగాడు ఇతనే
12) స్క్వాస్ మహిళల టీమ్ విభాగంలో భారత్ కు కాంస్యం దక్కింది. అన్‌హత్ సింగ్ , జ్యోత్స్న చిన్నప్ప, తాన్వీ బృందం కాంస్యం నెగ్గారు.
13) షాట్ పుట్ లో మహిళ విభాగంలో కిరణ్ బలియాన్ కాంస్యం సాదించింది.
14) 10, 000 మీటర్ల అథ్లెటిక్స్ లో గుల్వీర్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు.
15) పురుషుల షూటింగ్ ట్రాప్ టీమ్ వ్యక్తిగత విభాగంలో క్యానన్ చెనయ్ కాంస్యం గెలుచుకున్నాడు.
16) నిఖత్ జరీన్ కు 50 కేజీల బాక్సింగ్ విభాగంలో కాంస్యం దక్కింది.
17) మహిళల డిస్కస్ త్రో ఫైనల్ లో సీమా పూనియా కాంస్య పథకాన్ని సాధించింది.
18) మహిళల 800 మీటర్ల హెప్టథ్లాన్ లో నందిని అగ్సారా కాంస్య పథకాన్ని దక్కించుకుంది.
19) పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో జిమ్సన్ జాన్సన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకున్నాడు.
20) 3000 మీటర్ల మహిళల స్పీడ్ స్కేటింగ్ లో భారత మహిళల రిలే జట్టు (కార్తీక, హీరాలాల్, హరతి) విభాగంలో కాంస్యం సాదించింది.
21) 3000 మీటర్ల పురుషుల స్పీడ్ స్కేటింగ్ లో భారత పురుషుల జట్టు (ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్దాంత్ మరియు విక్రమ్) విభాగంలో కాంస్యం సాదించింది.
22) టేబుల్ టెన్నిస్ మహిళలు డబుల్స్ విభాగంలో భారత జోడి సుతీర్ద ముఖర్జీ, ఐహిక ముఖర్జీ లు కాంస్యం సాదించారు.
23) మహిళల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ లో భారత క్రీడాకారిణి ప్రీతి కి కాంస్యం దక్కింది.
24) పురుషుల డబుల్స్ కనోయ్ స్ర్పింట్ ఈవెంట్ లో భారత జోడి అర్జున్ సింగ్,.సునీల్ సింగ్ లు మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నారు..
25) మహిళల 54 కేజీల బాక్సింగ్ విభాగంలో ప్రీతి కాంస్యం దక్కింది.
26) మహిళల 400 మీటర్ల హర్డిల్స్ లో విద్యా రాజ్ కాంస్యం గెలుచుకుంది.
27) పురషుల ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రావేల్ కు కాంస్యం దక్కింది.
28) పురుషుల 92 కేజీల బాక్సింగ్ లో నరేందర్ కు కాంస్యం దక్కింది.
29) 35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రామ్ బబూ & మంజు రాణి జోడి కి కాంస్యం దక్కింది.
30) మహిళల 57 కేజీల బాక్సింగ్ లో ప్రవీణ్ హుడా కాంస్యం సాదించింది.
31) స్క్వాస్ మిక్స్‌డ్ డబుల్స్ లో అభయ్, అన్హత్ జోడి కాంస్యం సాదించింది.
32) పురుషుల 87 కేజీల గ్రీకో రోమన్ లో సునీల్ కుమార్ కాంస్యం నెగ్గాడు.
33) మహిళల 53 కేజీల ప్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్ లో అంతిమ్ పంగల్ కు కాంస్యం గెలుచుకుంది.
34) మహిళల స్పీక్ టకరా క్రీడల్లో రెగూ టీమ్ కాంస్యం సాధించింది.
35) బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ కాంస్యం గెలిచాడు.
36) మహిళల అర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్ లో- అంకిత, సిమ్రాన్ జిత్, భజన్ కౌర్ లు బృందం కాంస్యం సాదించింది.
37) మహిళల 75 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ లో కిరణ్ బిష్ణోయ్ కి కాంస్యం లభించింది.
38) మహిళల 62 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ లో సోనమ్ మాలిక్ కి కాంస్యం దక్కింది.
39) పురుషుల 57 కేజీల ప్రీ స్టైల్ రెజ్లింగ్ లో అమన్ షెరావత్ కి కాంస్యం లభించింది.
40) మహిళల అర్చరీ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్ లో భారత్ కు చెందిన ఆదితి గోపిచంద్ కాంస్యం గెలుచుకుంది.
41) మహిళల హకీ జట్టు కాంస్యం నెగ్గింది.