Home > TODAY IN HISTORY > Fools Day – పూల్స్ డే చరిత్ర

Fools Day – పూల్స్ డే చరిత్ర

BIKKI NEWS (APRIL 1) : APRILS 1st FOOLS DAY HISTORY – పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌లో కూడా సంవత్సరాది మార్చి మధ్యలోనే వచ్చేది. యూరప్‌లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు, వసంత కాలపు ఉత్సవాలు ఓ పది రోజుల పాటు జరిగేవి. ఏప్రిల్‌ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకునేవారు. ఇలా సజావుగా జరిగిపోతూన్న జీవితాలలో ఒక పెనుమార్పు వచ్చి పడింది.

అప్పటి ఫ్రాన్సు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక తాఖీదు జారీ చేసేడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్లు లేవు. కావునా రాజుగారి తాఖీదు అందరికీ అందలేదు.

అందిన వాళ్ళు కూడా పాత అలవాట్లని మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా, దేశపు మూలల్లో ఏప్రిల్‌ 1 న లాంఛనప్రాయంగా బహుమానాలు ఇచ్చుకోవటం మానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళికి ఏప్రిల్‌ ఫూల్స్‌ అనేవారు.