BIKKI NEWS (AUG. 26) : APPRENTICE JOBS IN POWER GRID CORPORATION. న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/రీజియన్లలో వివిధ విభాగాల్లో 1,031 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 08వ తేదీ లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
APPRENTICE JOBS IN POWER GRID CORPORATION
పీజీసీఐఎల్ కేంద్రం/ప్రాజెక్ట్/రీజియన్స్ :
కార్పొరేట్ సెంటర్(గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-1(ఫరీదాబాద్), నార్తర్న్ రీజియన్-2(జమ్మూ), నార్తెర్న్ రీజియన్-3(లక్నో), ఈస్ట్రన్ రీజియన్-1(పాట్నా), ఈస్ట్రన్ రీజి యన్-2(కోల్కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్(షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్( భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-1(నాగ్పూర్), వెస్ట్రన్ రీజియన్-2(వడో దర), సదరన్ రీజయన్-1(హైదరాబాద్), సదరన్ రీజియన్-2(బెంగళూరు ).
ట్రేడులు : ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/టెలికాం.
అర్హతలు : పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్రెంటిస్ కాలవధి : ఒక సంవత్సరం
స్టైపెండ్:
ఐటీఐ ట్రేడ్ రూ.13,500/-
డిప్లొమా ట్రేడ్ రూ.15,000/-
గ్రాడ్యుయేట్ ట్రేడ్/హెచ్ఎర్ ఎగ్జిక్యూటివ్/సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/లా ఎగ్జిక్యూ టివ్/రాజ్భాష అసిస్టెంట్ రూ.17,500/-
ఎంపిక విధానం : విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడి కల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : 20.08.2024 నుంచి 08.09.2024.
వెబ్సైట్ : https://www.powergrid.in