BIKKI NEWS (JAN. 22) : నాగర్ కర్నూల్ జిల్లాలో కింద పేర్కొనబడిన కేంద్రాలలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులైన నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ (applications for newvmee seva centres in telangana) ప్రకటన జారీ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగం కలిగిన కుటుంబ సభ్యులు ఈ ఉద్యో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు అర్హులు కాదు కావున ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మీసేవ కేంద్రాల ఏర్పాటుకు పేర్కొనబడిన మండలాలలోని తహసిల్దార్ కార్యాలయంలో జనవరి 23వ తేదీ లోపు ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
మీ సేవ కేంద్రాలు – కోడేరు మండలంలో తీగలపల్లి, మైలారం గ్రామాలలో ; వంగూరు మండలంలో కొండారెడ్డిపల్లి గ్రామం, ; తాడూరు మండలంలో తాడూరు గ్రామాలలో మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
అర్హతలు : మీసేవ కేంద్రం ఏర్పాటు చేయు గ్రామానికి సంబంధించిన స్థానిక యువకుడై ఉండాలి.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి.
డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
మీసేవ కేంద్రం ఏర్పాటుకు ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై 70 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది మరియు 30 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
దరఖాస్తు గడువు – జనవరి – 23
దరఖాస్తు ఫీజు : 500/- రూపాయాల డీడీ ని కలెక్టర్ అండ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ – గవర్నెన్స్ సొసైటీ పేరు మీద తీయాల్సి ఉంటుంది.