BIKKI NEWS (APRIL 30) : తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం (anganwadi superannuation at 65 Years) నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఈరోజు (ఏప్రిల్ 30) వరకు పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ సోమవారం ఆదేశాలు జారీచేశారు.
సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ సూచించింది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీచేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.
పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్‌కు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు.