BIKKI NEWS (MAY 01) : GST ఎప్రిల్ 2024 లో రికార్డు స్థాయిలో 2,10,267 కోట్ల రూపాయలు వసూళ్లు అయినట్లు (ALL TIME HIGH GST Revenue for April 2024) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది జిఎస్టి ప్రారంభించినప్పటి నుండి ఒక నెలలో వసూళ్లైన అత్యధిక వసూలు కావడం విశేషం.
ఇందులో CGST – 43,846 కోట్లు, SGST – 53,538 కోట్లు, IGST – 99,623 కోట్లు గా ఉంది. అలాగే సెస్ – 13,260 కోట్లు గా ఉంది.
2023 ఎప్రిల్ నెలతో పోలిస్తే 12.4% అధికం కావడం విశేషం. 2023 ఎప్రిల్ లో దాదాపు 1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు అయింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
నవంబర్ 2023 GST – 1.67 లక్షల కోట్లు
డిసెంబర్ 2023 GST – 1.64 లక్షల కోట్లు
జనవరి 2024 GST – 1.72 లక్షల కోట్లు
ఫిబ్రవరి 2024 GST – 1.68 లక్షల కోట్లు
మార్చి 2024 GST – 1.78 లక్షల కోట్లు