Home > JOBS > Agni Veer – నియామక విధానంలో మార్పులు

Agni Veer – నియామక విధానంలో మార్పులు

న్యూఢిల్లీ (ఫిబ్రవరి -05) : భారత ఆర్మీ అగ్నివీర్ నియామక ప్రక్రియను మార్చినట్టు (agni veer-selection-scheme-changed-by-indian-army) ప్రకటించింది. దీంతో ఇకపై సైనిక దళంలో చేరాలనుకునే అభ్యర్థులంతా తొలుత ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CEE)కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.

ఈ మార్పులకు సంబంధించిన వివరాలను ఆర్మీ ఇప్పటికే వివిధ వార్తాపత్రికల ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల మధ్యలో వెలువడవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్లో దేశవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో తొలి ఆన్లైన్ సీఈఈ పరీక్ష జరుగుతుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.