BIKKI NEWS : AGNI – V – MISSILE ను భారత రక్షణ శాఖ ఒడిస్సా లోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఐదవది. అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్ళగల సామర్థ్యం ఈక్షిపణికి ఉంది. 5 వేల పైబడిన కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను కచ్చితత్వంతో చేదించగల సామర్థ్యం ఈ క్షిపణిది. హైదరాబాద్ డి ఆర్ డి ఓ సంస్థ ఈ క్షీపనలను తయారు చేయడం విశేషం.ఇది ఒక ఖండంతార క్షిపణి, ఆసియా ఖండం మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి రానుంది.
మూడు దశల ఘన ఇంధనంతో నడుస్తోంది. 17.5 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు తో ఉంటుంది. 50 వేల కేజీల బరువు కలిగి ఉంటుంది. 1,500 కేజీల అణ్వస్త్రాలను మోసుకెళ్ళగలదు.
అగ్ని క్షిపణులు అగ్ని – I, II, III, IV, V, VI కలవు. అగ్ని – I,II,III,IV,V లు రక్షణ శాఖకు అందుబాటులో కలవు. ఇందులో అగ్ని – VI ప్రయోగ దశలో ఉంది.
పోటీ పరీక్షల నేపథ్యంలో అగ్ని క్షిపణుల గురించి పరిపూర్ణ సమాచారం మీకోసం…
◆ TYPES OF AGNI MISSILES AND RANGE
క్షిపణి | రకం | పరిధి (కీ.మీ.) |
అగ్ని – 1 | మద్యంతర క్షిపణి | 700-1,250 |
అగ్ని – 2 | మద్యంతర క్షిపణి | 2,000 – 3,000 |
అగ్ని – 3 | మద్యంతర క్షిపణి | 3,500 – 5,000 |
అగ్ని – 4 | మద్యంతర క్షిపణి | 4,000 – 6,500 |
అగ్ని – 5 | ఖండాతర క్షిపణి | 5,000 – 8,000 |
అగ్ని – 6 | ఖండాతర క్షిపణి | 8,000 – 10,000 |