Jobs with GATE score -గేట్ స్కోరుతో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్లు

BIKKI NEWS (SEP. 23) : central government jobs with GATE score. భారత ప్రభుత్వానికి చెందిన క్యాబినెట్ సెక్రటేరియట్ 160 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్-టెక్నికల్ (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్) పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులను గేట్ స్కోరు, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు.

central government jobs with GATE score

అర్హతలు : ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ/ టెక్నాలజీ/ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయాలి.

వయోపరిమితి : 30 సంవత్సరాలు మించకూడదు. (రిజర్వేషన్లు అనుగుణంగా సడలింపులు ఉంటాయి.)

ఎంపిక విధానం : గేట్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూను చెన్నై, గురుగ్రామ్, గువహతి, జమ్మూ, జోద్ఫుర, కోల్కతా, లక్నో, ముంబయిల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు వీటిలో నుంచి ఒక పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

దరఖాస్తు విధానం : ప్రకటనలో పేర్కొన్న దరఖాస్తు ఫార్మాట్ ను టైప్ చేసి వివరాలను నింపాలి. వీటిని సాధారణ పోస్టులో పంపాలి.

ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తులను సంబంధిత విభాగాల ద్వారా పంపాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా :
పోస్టు బాక్స్ నంబర్: 001,
లోధి రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూడిల్లీ-110 003.

దరఖాస్తు గడువు : 21 – 10 – 2024

దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా షార్ట్ లిస్టును తయారు చేస్తారు. ఈ అభ్యర్ధులకు ఇంటర్వ్యూ తేదీ, సమయం, కేంద్రాలను వారి ఈమెయిల్ ఐడీకి తెలియజేస్తారు.

ఎంపికైన వారిని దేశంలో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.

పూర్తి వివరాలూ, దరఖాస్తు ఫార్మాట్ కోసం సెప్టెంబరు 21న ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో వెలువడిన ఉద్యోగ ప్రకటనను సమగ్రంగా చదవాలి.

వెబ్సైట్ :https://cabsec.gov.in

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు