BIKKI NEWS (AUG. 29) : Pension rebellion day on September 1st. సెప్టెంబర్ -1 (ఆదివారం) పెన్షన్ విద్రోహ దినంగా రాష్ట్ర & జిల్లా స్థాయిలో చేసే నిరసన కార్యక్రమాలలో పాల్గొంటూ భాగస్వామ్యం అవుతామని, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
Pension rebellion day on September 1st
తెలంగాణ ఉద్యోగులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు హక్కుల కొరకు TNGO & TGO ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికుల, పెన్షనర్స్, సంఘాలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ (T.G.E.J.A.C) TGJLA-475 , TGEJAC ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమంలో తమ సంఘ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, రాష్ట్ర స్థాయి & జిల్లా స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సి.పి.ఎస్., యు.పి.ఎస్ లను రద్దు చేయాలని, ఓ.పి.ఎస్. ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.