BIKKI NEWS (AUG. 25) : FREE DSC COACHING BY NTR MEMORIAL TRUST. పేద అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ మరియు మెటీరియల్ అందజేయడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
FREE DSC COACHING BY NTR MEMORIAL TRUST
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బిఈడి, టీటీసీ, టెట్, సీటెట్ ఉన్న అభ్యర్థులు అర్హులు.
అనుభవగులైన అధ్యాపకులు చేత శిక్షణ ఇప్పించబడుతుంది మరియు స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు శిక్షణ ఇవ్వబడుతుంది.
ఈ ఉచిత శిక్షణ చిత్తూరు జిల్లాలోని కుప్పం మండల కేంద్రంలో ఇవ్వబడుతుంది. కావున తక్కువ సీట్లు అందుబాటులో ఉన్న కారణంగా తొందరగా దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొన్నది.
FREE DSC COACHING APPLICATION FORM