TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 08 – 2024

BIKKI NEWS (AUG 22) : TODAY NEWS IN TELUGU on 22nd AUGUST 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd AUGUST 2024

TELANGANA NEWS

15 – 20 ఏళ్ళ తర్వాత అక్రమ నిర్మాణాలు అంటూ హైడ్రా కూల్చివేయడం ఏమిటి.? – హైకోర్టు ప్రశ్న

విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరులో విఫలమైన 54 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్.

తెలంగాణ‌లో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను అమ‌లు చేయండి : మంద‌కృష్ణ మాదిగ‌.

తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఓట‌రు జాబితా త‌యారీకి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం బుధ‌వారం షెడ్యూల్ విడుద‌ల చేసింది.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చిల్ల‌ర భాష‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం ఏదో ఒక చిల్ల‌ర భాష మాట్లాడి అటెన్ష‌న్ డైవ‌ర్ట్ చేయడానికి చూస్తార‌ని కేటీఆర్ తెలిపారు

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్లు ఏం చేస్తున్నారు… ప‌నుల‌ పురోగ‌తి ఏంట‌నే దానిపై రోజువారీ స‌మీక్ష చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌ జలకళను సంతరించుకుంటున్నాయి. తాజాగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్ట్‌లోకి 10,591 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉన్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు నివేదించింది.

ANDHRA PRADESH NEWS

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలుడు.. 18కి చేరిన మృతుల సంఖ్య

ఏపీ శాసన మండలి చైర్మన్‌ పదవికి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు

ఏపీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు గాను పోలీసు వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.

ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్‌ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

జగన్‌ విదేశి పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇరువురి పిటిషన్‌లపై వాదనలు ముగియగా ఈనెల 27కు నిర్ణయాన్ని వాయిదా వేశారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు.

26 మంది డీఎస్పీ ల బదిలీ

NATIONAL NEWS

లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్‌ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్ అన్నారు.

వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు.

మహారాష్ట్రలోని బద్లాపూర్‌ స్కూల్‌లో చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విపక్షాలు మహారాష్ట్ర సర్కార్‌ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానం పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.

భారత్‌ నుంచి పారిపోయి మలేషియాలో ఆశ్రయం పొందుతున్న వివాదాస్పద మత బోధకుడు జకీర్‌ నాయక్‌ అప్పగింతపై మలేసియా నుంచి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి.

ముడా స్కామ్‌ కేసులో తనపై ప్రాసిక్యూషన్‌కు తక్షణమే ఆమోదం తెలిపిన గవర్నర్‌ వివక్ష ప్రదర్శించారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి.. 75 ఏళ్లు నిండిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి తెలిపారు. ఒక‌వేళ ఆయ‌న అలా చేయ‌కుంటే, అప్పుడు మోదీని త‌న కుర్చీ నుంచి త‌ప్పించేందుకు మ‌రోలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయ‌ని హెచ్చ‌రించారు.

రాబోయే ఐదేళ్లలో 70 ఉపగ్రహాలను ప్రయోగించే యోచనలో ఉన్నామని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ఇందులో చంద్రయాన్‌-4, చంద్రయాన్‌-5 మిషన్స్‌ సైతం ఉన్నాయని తెలిపారు.

దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: మాయావతి.

జాబిల్లి పై ఒకప్పుడు మాగ్మా సముద్రం – చంద్రయాన్ – 3

45 సంవత్సరాల తర్వాత పోలెండ్ లో దిగిన భారత ప్రధానమంత్రి

సెప్టెంబర్ 2024 నుంచి దేశంలో జనగణన

చాందీపురా వైరస్ తో 26 మంది చిన్నారుల మృతి – గుజరాత్ రాష్ట్ర మంత్రి ప్రకటన

ప్రశాంతంగా భారత్ బంద్

INTERNATIONAL NEWS

పోలాండ్‌, ఉక్రెయిన్ దేశాల ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోదీ వెళ్తున్నారు. ఇవాళ ఆయ‌న వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

ఎంపాక్స్‌ కొత్త కొవిడ్‌ కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్‌వో యూరప్‌ ప్రాంతీయ సంచాలకులు హన్స్‌ క్లుగె మంగళవారం తెలిపారు.

భూతాపం తక్కువగా ఉంటే 2500 నాటికి సముద్రమట్టం 1.7 మీటర్ల మేర పెరుగుతుందని, భూతాపం ఎక్కువగా ఉంటే 19.5 మీటర్ల వరకు కూడా పెరగొచ్చని, సముద్రంలోకి ఎక్కువగా నీరు చేరడం వల్ల ఈ ముప్పు పెరుగుతున్నట్టు తెలిపారు.

ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి ‘ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌’లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకోనున్నారు. ఇందుకోసం ఆయన 10 గంటల పాటు రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది

షాజహాన్ బంగ్లాదేశ్‌ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశాడు.

ఇరాన్‌లో బస్సు బోల్తా.. 28 మంది పాకిస్థాన్‌ యాత్రికులు మృతి.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : 80,905 (102)
నిఫ్టీ : 24,770 (71)

డాలర్ తో రుపాయి మారకం విలువ 84.80 గా ఉంది.

ప్రపంచంలోనే అత్యుత్తమ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌

ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహర బ్రాండ్ గా అమూల్

డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్‌ మరో ప్రత్యేక డిపాజిట్‌ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దివిటిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న అమర రాజా లిథియం అయాన్‌ బ్యాటరీ ప్లాంట్‌.. పూర్తిస్థాయి ఉత్పత్తిని అందుకోవడానికి ఆరేండ్లు పడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలతో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మరో బూమ్‌ రాబోతున్నదని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

SPORTS NEWS

నేడు లుసానే డైమండ్ లీగ్ … స్వర్ణం పై గురిపెట్టిన నీరజ్ చోప్రా

ఒలింపిక్ విజేత‌గా హాకీకి వీడ్కోలు ప‌లికిన పీఆర్ శ్రీ‌జేష్ పై కాసుల వ‌ర్షం కురుస్తోంది. ఇప్పటికే హాకీ ఇండియా రూ.5 ల‌క్ష‌లు ప్ర‌క‌టించగా.. కేర‌ళ ప్ర‌భుత్వం ఏకంగా రూ.2 కోట్లు ఇస్తామ‌ని చెప్పింది.

ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్ ఆడం గిల్‌క్రిస్ట్ తాజాగా టాప్ 3 వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్లు ఎవ‌రో చెప్పాడు. మ‌హేంద్ర సింగ్ ధోనీ, రొడ్నీ మార్ష్‌, కుమార సంగక్కర.

బాలీవుడ్‌లో యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌.. ప్రొడ్యూస్‌ చేయనున్న టీ సిరీస్‌.

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సన్నాహకమైన సిన్సినాటీ ఓపెన్‌లో టాప్‌ ర్యాంకర్‌ జానిక్‌ సిన్నర్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ విజేతగా సబలెంకా నిలిచింది.

పారిస్ ఒలింపిక్స్‌తో సంచ‌ల‌నంగా మారిన భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ త‌న బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేసింది. విశ్వ క్రీడ‌ల త‌ర్వాత ఆమె ఏకంగా కోటి రూపాయ‌లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

వెనిజులా సైక్లిస్ట్ డానిలా లార్రియ‌ల్ చిరినోస్‌.. లాస్ వెగాస్‌లోని అపార్ట్‌మెంట్‌లో మృతిచెందారు. ఆగ‌స్టు 16వ తేదీన ఆమె మృత‌దేహాన్ని గుర్తించారు

EDUCATION & JOBS UPDATES

APPSC GROUP 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

వరంగల్ నిట్ లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్స్

NMMSSE 2024 దరఖాస్తు ప్రారంభం

దేశంలో 21 నకిలీ యూనివర్సిటీ లు, ఆంధ్రప్రదేశ్ లో 2 నకిలీ యూనివర్సిటీ లు

ENTERTAINMENT UPDATES

హాలీవుడ్ న‌టుడు బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు తీసుకునేందుకు జెన్నిఫ‌ర్ లోపేజ్ దర‌ఖాస్తు చేసుకున్న‌ది. రెండు ఏళ్ల వివాహ బంధానికి ఆ ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పేస్తున్నారు.

హాలీవుడ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్‌ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది ది లయన్‌ కింగ్. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్‌గా వస్తోంది ముఫాసా: ది లయన్‌ కింగ్. మాఫాసా కు తెలుగు లో వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు

తమిళ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన యువ నటి సనమ్‌ శెట్టి

బాలీవుడ్‌ చిత్రాలు భారత్‌ను తక్కువ చేసి చూపిస్తున్నాయ్ : రిషబ్‌ శెట్టి

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు