DASARATHI AWARD – అందేశ్రీ కి దాశరథి పురష్కారం

BIKKI NEWS (JULY 19) : DASARATHI AWARD 2024 TO ANDHE SRI. శ్రీ కృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ప్రదానం చేస్తున్న మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం- 2024కు ప్రజా వాగ్గేయకారుడు అందెశ్రీ ని ఎంపిక చేసినట్టు భాషానిలయం గౌరవ కార్యదర్శి తెలిపారు.

జూలై 23న సుల్తాన్ బజార్ లోని భాషా నిలయం ఆడిటోరియంలో అందెశ్రీని రూ. 10 వేలు, జ్ఞాపికతో సత్కరిస్తామన్నారు.

యార్లగడ్డకు సినారె పురస్కారం

C NARAYANA REDDY AWARD TO YARLAGADDA. రసమయి సాంస్కృతిక సంస్థ ఆధ్వ ర్యంలో జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి 93వ జయంతిని ఈనెల 22న తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు రాము ఓ ప్రకటనలో తెలిపారు. సినారె పురస్కారాన్ని ఏపీ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు, పద్మ భూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ప్రదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు