TGPSC – జీవో నం 3, 35 ప్రకారం జేఎల్ పోస్టుల నూతన కేటాయింపు

BIKKI NEWS (JUNE 28) : JL POSTS BREAKUP AS PER GO NO 3 & 35. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్మీడియట్ విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లోని పోస్టులను జీవో నెంబర్ 3 మరియు జీవో నెంబర్ 35 ప్రకారం కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ జేఎల్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 3 ప్రకారం మరియు జీవో నెంబర్ 35 ప్రకారం పోస్టులను రిజర్వేషన్ల వారీగా కేటాయిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా సబ్జెక్టుల వారిగా రిజర్వేషన్ల వారీగా ఖాళీగా వివరాలను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.

మొత్తం 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి రాత పరీక్షలు పూర్తై, ప్రాథమిక కీ మరియు తుది కీ కూడా విడుదలయ్యింది.

త్వరలోనే ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయనుంది. తదనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి పోస్టుల భర్తీ చేయనుంది.

JL POSTS BREAKUP AS PER GO NO 3 & 35 CHECK HERE

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు