RTC JOBS – 3 వేల ఉద్యోగాలకు ప్రతిపాదనలు – సజ్జనార్

BIKKI NEWS (JUNE 03) : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ లో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు (TS RTC 3000 JOBS NOTIFICATION SOON) సంస్థ ఎండి సజ్జనార్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు

త్వరలోనే 2,000 డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల్లో సిబ్బంది కొరత లేకుండా 3 వేల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు, ప్రభుత్వం అనుమతించిన వెంటనే భర్తీ ప్రక్రియ కూడా చేపడతామని ప్రకటించారు.

మహిళలకు ఉచిత బస్ టికెట్ పథకం అయిన మహాలక్ష్మి పథకం అమలుకు ముందు రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే, పథకం అమలు తర్వాత రోజుకు 55 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు.