TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 25th FEBRUARY 2024

1) రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండు సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు ఎంతమంది సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ ప్రకటించారు.?
జ : 31 వేల మంది

2) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో భారత్ తరపున అత్యధిక సార్లు (35 సార్లు) 5 వికెట్ల ప్రదర్శన చేసిన కుంబ్లే రికార్డును ఎవరు సమం చేశారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

3) భారత్ జపాన్ మధ్య రాజస్థాన్ లో ప్రారంభమైన సైనిక విన్యాసాల పేరు ఏమిటి.?
జ : ధర్మ గార్జియన్

4) పాకిస్తాన్ భూభాగంలో ఇటీవల ఏ దేశం సర్జికల్ స్ట్రైక్ జరిపింది.?
జ :ఇరాన్

5) ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక ప్రకారం త్వరలోనే ఎంత శాతం జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉందని తెలిపింది.?
జ: 22%

6) రంజీ మ్యాచులలో ఆంధ్ర తరపున ఒకే సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రికీ భుయ్ (893*)

7) భూమి మీద నిఘా పెట్టగలిగే అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని ఏ స్టార్టప్ సంస్థ త్వరలోనే అంతరిక్షంలోని ‘లో ఎర్త్ ఆర్బిట్’ లో ప్రవేశపెట్టనుంది.?
జ : అల్బెడో

8) దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు.?
జ : ద్వారకా (గుజరాత్)

9) స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర గర్భంలోని ద్వారకా నగరంలో ఇటీవల ఎవరు ప్రత్యేక ప్రార్థనలు చేశారు .?
జ: ప్రధాని నరేంద్ర మోడీ

10) ఫైనాన్షియల్ టైమ్స్ సంస్థ 2023 సంవత్సరానికి ఏ పదాన్ని ఇయర్ ఆఫ్ ది వర్డ్ గా ప్రకటించింది.?
జ : గ్లోబల్ సౌత్

11) మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు లోక్ సభ స్పీకర్ గా సేవలందించిన నేత ఇటీవల మరణించారు అతని పేరు ఏమిటి.?
జ : మనోహర్ జోషి

12) వాహనాన్ని దూకుడుగా నడిపిన, ప్రమాదానికి కారణమైన వారికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించే భారత న్యాయ సంహితలోని సెక్షన్ ఏమిటి.?
జ : 106 (2)