SCHOLARSHIP – కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్

BIKKI NEWS (JAN. 21) : తెలంగాణ కార్మిక మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలను అందించేందుకు (scholarship for private worker Children) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దుకాణాలు, కర్మాగారాలు, మోటరు వాహనాల రిపేరింగ్, వాణిజ్య, సహకార, ధార్మిక సంస్థలు ఇతర ట్రస్టులో చేసున్న కార్మికుల పిల్లలు 2022 – 2023 సంత్సరానికి గాను స్కాలర్షిప్ పొందడానికి అప్లయ్ చేసుకోవాలని సూచించారు.

అర్హతలు : పదో తరగతి, ఐటీఐ (1,000), పాలిటెక్నిక్ (1,500), ఇంజినీరింగ్, మెడిసిన్, లా, బీఎస్సీ, అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్, ఏంసీఏ, బీబీఏ, డిప్లొమా ఇన్ మెడికల్ లేబోరిటరీ టెక్నిషయన్ లలో ఉత్తీర్ణులైన వారికి (2,000) అందిస్తామని చెప్పారు.

ఎంపిక విధానం : సంబంధించిన కోర్సుల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు మేడే నాటికి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు.

దరఖాస్తు గడువు : దరఖాస్తులను ఫిబ్రవరి 15లోగా కార్మిక శాఖ కార్యాలయంలో అందించాలని
సూచించారు.