Home > SPORTS > 6 WICKETS IN A OVER : 6 బంతుల్లో 6 వికెట్లు

6 WICKETS IN A OVER : 6 బంతుల్లో 6 వికెట్లు

హైదరాబాద్ (నవంబర్ – 14) : ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. గోల్డ్‌కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్-3 టోర్నీలో నెరాంగ్ క్లబ్ కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్… సర్ఫర్స్ పారడైజ్ సీసీపై ఈ ఘనత సాధించాడు. 6 wickets for 6 balls in a over Gareth Morgon

40 ఓవర్ల మ్యాచ్ 178 పరుగుల ఛేదనలో 39 ఓవర్లకు 174/4తో విజయానికి చేరువైన పారడైజ్ జట్టుకు గారెత్ (7/16) షాకిచ్చాడు. ఆఖరి ఓవర్లో 6 బంతులకు 6 వికెట్లు తీసి నెరాంగ్ క్లబ్ ను గెలిపించాడు. ఈ 6 బంతుల్లో తొలినాలుగు క్యాచ్ లు, ఆ తర్వాత రెండు బౌల్డ్ లు ఉన్నాయి.

ప్రొఫెషనల్ క్రికెట్ లో ఒక ఓవర్ లో అయిదు వికెట్లు తీసిన అభిమన్యు మిథున్ (భారత్, 2019), వాగ్నర్ (న్యూజిలాండ్, 2011), అమీన్ (బంగ్లాదేశ్, 2013)లను గారెత్ అధిగమించాడు.