హైదరాబాద్ (సెప్టెంబర్ 23) : ఇంటర్మీడియట్ పూర్తి చేయకుండా నేరుగా పదవ తరగతి తర్వాత ఓపెన్ డిగ్రీ విధానంలో డిగ్రీ పూర్తి చేసి, బిఈడి చేసిన అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న టీచర్ పోస్టులకు అర్హులైనంటూ (open degree holders eligible for dsc notification) విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు
అయితే ప్రస్తుతం ఆన్లైన్ లో దరఖాస్తు నింపేటప్పుడు ఇంటర్మీడియట్ వివరాలు నింపవలసి రావడంతో దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు కలదు.