హైదరాబాద్ (జూలై – 11) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU MOBILE APP, WEB RADIO) విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది.
వెబ్ రేడియో, మొబైల్ యాప్ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సీసీఎల్ఎ నవీన్ మిట్టల్ సోమవారం ప్రారంభించారు.
ఈ రెండు రకాల సేవల వల్ల వర్సిటీ సమాచారాన్ని విద్యార్థులు ఎప్పుటికప్పుడు తెలుసుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని నవీని మిట్టల్ చెప్పారు. వెబ్ రేడియోను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా లాగిన్ కావచ్చు.