Home > EMPLOYEES NEWS > Retirement – ఈ ఏడాది 9 వేల మంది పదవి విరమణ

Retirement – ఈ ఏడాది 9 వేల మంది పదవి విరమణ

BIKKI NEWS (APR. 08) : 9000 employees will retire in 2025 in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 9,000 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నట్లు ఆర్థిక శాఖకు ప్రాథమిక సమాచారం అందినట్లు సమాచారం.

9000 employees will retire in 2025 in telangana

తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్లలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చెల్లించే పింఛన్ సొమ్ము దాదాపు 3 రెట్లు పెరిగినట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది 2014 15లో పెన్షన్లకు 7000 కోట్ల రూపాయలు చెల్లించగా 2025 – 26లు 21 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని అంచనా వేసింది.

గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయోపరిమితిని 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచడంతో 2021 – 2024 మధ్య పెద్దగా పదవి విరమణలు జరగలేదు.

ఈ ఏడాది నుండి పదవి విరమణ పొందే వారి సంఖ్య ఏడాదికి 9 నుండి 10 వే వరకు ఉండోచ్చని అంచనా… దీంతో పదవి విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన సొమ్ము ఏటా 1000 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా.

తెలంగాణ రెండవ పిఆర్సి మరియు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీటిని కూడా అమలు చేస్తే పెన్షన్ల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము మరింత పెరిగే అవకాశం ఉంది.

అలాగే గత ఏడాది కాలంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన నేపథ్యంలో జీత భత్యాలకు కూడా భారీగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో మొత్తంగా సంవత్సరానికి వేతనాలు, పెన్షన్లు కలిపి 36 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు