Gurukula Jobs – గురుకులాల్లో 6 వేల ఉద్యోగ ఖాళీలు

BIKKI NEWS (AUG. 15) : 6 THOUSAND GURUKULA JOBS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకులాల్లో 6 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశముంది. 2025-26 జాబ్ క్యాలెండర్ లో వీటిని చేర్చి భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

6 THOUSAND GURUKULA JOBS IN TELANGANA

సంక్షేమ గురుకులాల్లో ఖాళీల భర్తీకి గురుకుల నియామక బోర్డు 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి 1,800కు పైగా బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉండొచ్చని అంచనా.

పై పోస్ట్ నుండి కింది పోస్టు (డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి నుంచి కిందిస్థాయి వరకు) వరకు భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, గతంలో మాదిరి రీలింక్విస్ట్మెంట్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.

ఒకేసారి నాలుగైదు కేటగిరీ పోస్టుల ఫలితాలు ఇవ్వడంతో కొందరు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం తో పై పోస్ట్ లో చేరుతూ మిగిలిన వాటిని వదులుకుంటున్నారు.

ఆగస్టు మొదటి వారంలో కొత్తగా నియమితులైనవారికి గురుకుల సొసైటీలు పోస్టింగులు ఇచ్చాయి. అభ్యర్థులు ఆయా పోస్టుల్లో చేరేందుకు 60 రోజుల సమయం ఉంది. ఈ గడువు తర్వాత గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టులపై మరింత స్పష్టత రానుంది.

డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. ఇంటర్మీడియట్ విద్యలో జేఎల్ పోస్టుల నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ఈ రెండు విభాగాల పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో గురుకులాల్లో ఇప్పటికే పోస్టులు సాధించిన వారు ఉన్నారు. ఉపాధ్యాయ, జేఎల్ ఉద్యోగాలు దక్కితే.. గురుకులాల్లో పోస్టులు పొందిన వారు సొసైటీ ఉద్యోగాల నుంచి ఆ కొలువుల్లోకే వెళ్లే అవకాశాలున్నాయి. గతంలోనూ ఇదే తరహాలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్లిపోవడంతో గురుకుల సొసైటీలో ఖాళీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ, జేఎల్ పరీక్షల ఫలితాల అనంతరం గురుకులాల్లో మరో వెయ్యి నుంచి 2 వేల పోస్టులు ఖాళీ కానున్నట్లు సమాచారం.

ఎస్సీ గురుకుల సొసైటీలో దాదాపు 1,800కు పైగా పోస్టులతో పాటు మిగిలిన సొసైటీల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఈ పోస్టులకు సకాలంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు. ఈ పోస్టులన్నీ కలిపితే గురుకులాల్లో దాదాపు 6 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు