Home > SPORTS > 6 బంతుల్లో 6 సిక్సర్ ల వీరులు

6 బంతుల్లో 6 సిక్సర్ ల వీరులు

BIKKI NEWS (APRIL 14) : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు (6 sixes in 6 balls cricketers) ఇప్పటివరకు నాలుగు సార్లు నమోదు అయ్యాయి. అందులో ఒకే ఓవర్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు మూడుసార్లు, వరుస బంతుల్లో (రెండు ఓవర్ లలో) ఆరు సిక్సర్లు ఒకసారి నమోదయ్యాయి. ఈ రికార్డును రెండుసార్లు తన పేరు మీద నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ రచించుకున్నాడు.

తాజాగా ఖతార్ తో జరుగుతున్న టి20 సిరీస్ లో దీపేంద్ర సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు.

గతంలోనూ వరుస బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు ఇతని పేరు మీద ఉంది. అయితే గతంలో ఒక ఓవర్లో ఐదు సిక్సర్లు తదుపరి ఓవర్లో ఒక సిక్స్ వరుస బంతుల్లో కొట్టాడు.

టి20 క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2007 లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పై టీ20 ప్రపంచ కప్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది భళా అనిపించాడు.

తరువాత కీరన్ పోలార్డ్ శ్రీలంక పై 2021లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.