BIKKI NEWS (DEC.22) : 55th GST council decisions. 55వ జీఎస్ఠీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం జైసల్మేర్ లో జరిగింది.
55th GST council decisions
అందరూ ఎదురు చూసిన ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ ఎత్తివేత నిర్ణయంను వాయిదా వేశారు. పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.5 లక్షలు దాటిన ఆరోగ్య బీమాపై 18 శాతం జీఎస్టీ రేటు యధాతథంగా కొనసాగుతుంది
అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయమై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
వీటి మీద జీఎస్టీ ఎత్తివేత
- ఫోర్ట్ ఫైడ్ బియ్యం పై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గించారు .
- జన్యుపరమైన చికిత్సలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు.
- రుణ గ్రహీతలపై బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)లు వేసే జరిమానాల మీద జీఎస్టీని తొలగించారు.
- రూ.2000 లోపు పేమెంట్స్ జరిపే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు. అయితే, ఇది పేమెంట్ గేట్ వేలు, ఫిన్ టెక్ సంస్థలకు వర్తించదు.
- ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్ స్విగ్గీ, జొమాటోలపై విధించాల్సిన పన్నురే ట్లపై నిర్ణయాన్ని వాయిదా వేశారు
ఇవి జీఎస్టీ పరిధిలోకి
- పాప్ కార్న్ 5, 12, 18 శాతం జీఎస్టీ లు
- వ్యాపార విధానంలో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తే జీఎస్టీ 18%
- వ్యక్తిగత విధానంలో ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయిస్తే జీఎస్టీ లేదు
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్