Home > EDUCATION > INTERMEDIATE > ఇంటర్ విద్య డైరెక్టర్ ని కలిసిన 475 రాష్ట్ర, జిల్లా నాయకులు

ఇంటర్ విద్య డైరెక్టర్ ని కలిసిన 475 రాష్ట్ర, జిల్లా నాయకులు

BIKKI NEWS (APR. 17) : 475 union leaders met intermediate director today. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి మరియు ఇంటర్ విద్య డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య గారిని తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర మరియు జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రః ఇవ్వడం జరిగిందని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వి. శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ళలు తెలిపారు.

475 union leaders met intermediate director today

ఆయా సమస్యల పట్ల కమిషనర్ కృష్ణ ఆదిత్య సానుకూలంగా స్పందించి… త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలియ జేశారని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నివేదించిన పలు సమస్యలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని, మరియు నూతనంగా నెలకొల్పిన 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు టీచింగ్, నాన్ -టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని, 26 జిల్లాలకు రెగ్యులర్ డి ఐ ఈ ఓ పోస్టులు శాంక్షన్ చేయాలని, 2023 మే 03న క్రమబద్ధీకరించబడిన నూతన అధ్యాపకులకు పోలీస్ వెరిఫికేషన్, రోస్టర్ కం రిజర్వేషన్లు కేటాయించాలని, 2024 మే నెలలో ఎన్నికల డ్యూటీ చేసిన సిబ్బంది అందరికీ ELs మంజూరు చేయాలని, ఆయా కళాశాలలో చరిత్ర బై రాజనీతి శాస్త్రం పోస్టులకు సపరేటుగా అధ్యాపకులు కేటాయించాలని, వోకేషనల్ కోర్సులలో సెకండ్ పోస్టుకు అధ్యాపకులు నియమించాలని, స్పాట్ వాల్యుయేషన్ రెమినరేషన్ ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెంచాలని, స్పాట్ మరియు ఎగ్జామ్స్ విధుల్లో ఉన్నవారికి వెంటనే డబ్బులు చెల్లించాలని, విద్యార్థుల డిమాండ్ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొత్త కోర్సులు శాంక్షన్ చేయాలని, మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ లాంగ్వేజ్ లో సంస్కృతం పోస్ట్ లూ శాంక్షన్ చేయాలనే నిర్ణయాన్ని రద్దు చేయాలని, మరియు నూతన అధ్యాపకులకు 17 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర పనిచేస్తూ బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్నారని వీరికి బదిలీలు చేయాలని పలు సమస్యలపై వినతి పత్రం ఇవ్వటం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్య డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి అధ్యాపకులకు పలు సూచనలు చేశారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్ పెంచడానికి అధ్యాపకులందరూ కృషి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, ఇందుకు అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం మొదటి రోజు నుండే అధ్యాపకులందరూ కృషి చేయాలని పలు సూచనలు చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 2025 డైరీ ని ఇంటర్ విద్య డైరెక్టర్ గారు ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఎం శ్రీనివాస్ రెడ్డి,.సంగీత,.శోభన్, మల్లారెడ్డి, విశాలక్ష్మి , హనుమకొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ విజయ మోహన్,. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బొజ్జ అనిల్ కుమార్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్, ములుగు జిల్లా కార్యదర్శి హరిగోపాల్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుమ్మడి మల్లయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, రవికిరణ్, జగిత్యాల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేష్, రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుల కంచర్ల శ్రీకాంత్, లక్ష్మణ్, బండి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు