TG JOBS – 1284 ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 12) : 1284 LAB TECHNICIAN JOBS NOTIFICATION IN TELANGANA . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్ పరిధిలో 1,088, వైద్య విధాన పరిషత్ పరిధిలో 183, యంయన్‌జే క్యాన్సర్ హస్పిటల్ పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి.

1284 LAB TECHNICIAN JOBS NOTIFICATION IN TELANGANA

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 05 – 2024 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు : 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

అప్లికేషను గడువు : సెప్టెంబర్ 21 – 2024 నుంచి అక్టోబర్ – 05 – 2024 వరకు

దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : అక్టోబర్ 07, 08 తేదీలలో

రాత పరీక్ష తేదీ : నవంబర్ – 10 -2024న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో నిర్వహించనున్నారు.

పరీక్ష విధానం : 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. 20 మార్కులను తెలంగాణ వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు/ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ కింద కేటాయించారు.

అర్హతలు : కింద ఇవ్వబడిన అర్హతలలో ఏదోకటి ఉండాలి.

ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ / MLT వోకేషనల్ కోర్స్/ DMLT / Bsc MLT/ Msc MLT / BMLT/ MLT లో డిప్లొమా/ క్లినికల్ బయో కెమిస్ట్రి / BSc లేదా MSc మైక్రో బయాలజీ/ MSc – బయో కెమిస్ట్రి లేదా మెడికల్ బయో కెమిస్ట్రి లేదా క్లినికల్ మైక్రో బయాలజీ

వయోపరిమితి : 01 – 07 – 2024 నాటికి 18 – 46 సంవత్సరాల మద్య ఉండాలి. ( రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 500/- రూపాయలు

పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF
వెబ్సైట్ : https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు