Home > TELANGANA > డిజిటల్ యుగంలో AI – తెలుగు భాషాభివృద్ధి – అవశ్యకత – అవకాశాలు

డిజిటల్ యుగంలో AI – తెలుగు భాషాభివృద్ధి – అవశ్యకత – అవకాశాలు

BIKKI NEWS (APRIL 15) : Zoom meeting on AI and Telugu language development. ప్రస్తుత ప్రపంచంలో విరివిగా వినిపిస్తున్న సాంకేతికత…!! ఇరవై ఒకటో శతాబ్దం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో దూసుకెళ్తోంది… ఇది సైన్స్ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తోంది. మానవ మేధస్సు సృష్టిలోనే అత్యుత్తమైనదిగా భావిస్తారు. జ్ఞాపకాలను గుర్తుంచుకోవడం, నెమరువేయగలగడం, సమస్యలను పరిష్కరించడం, తార్కిక-గణన శక్తి, సాంకేతిక పదాలతోపాటు సాధారణ భాషలను అర్థంచేసుకోవడం, నూతన పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించడం లాంటి వివిధ సామర్థ్యాల సమాహారాన్నే మేధస్సు గా పరిగణిస్తారు. మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసేదే ఆలోచించగల శక్తి, తార్కిక జ్ఞానం.దీనికి ప్రతిసృష్టే….” కృత్రిమ మేధస్సు”.

తెలంగాణ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో “డిజిటల్ యుగంలో AI – తెలుగు భాషాభివృద్ధి – అవశ్యకత – అవకాశాలు.”- అనే అంశంపై 16.04.24( మంగళవారం) రోజున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆన్లైన్ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.మీటింగ్ లో పాల్గొనడానికి కావాల్సిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

Topic: డిజిటల్ యుగంలో AI – తెలుగు భాషాభివృద్ధి- ఆవశ్యకత – అవకాశాలు.

Time: Apr 16, 2024 10:30 AM India

ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే స్వయంప్రతిపత్త వాహనాలు (డ్రోన్‌లు మరియు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వంటివి), వైద్య నిర్ధారణ, , ఆటలు ఆడటం (చెస్), సెర్చ్ ఇంజన్‌లు (గూగుల్ సెర్చ్ వంటివి) , ఆన్‌లైన్ సహాయకులు (సిరి వంటివి), ఫోటోగ్రాఫ్‌లలో ఇమేజ్ రికగ్నిషన్, స్పామ్ ఫిల్టరింగ్, రక్షణ రంగం ,ఎలక్షన్ మేనేజ్మెంట్ ,వాతావరణ మార్పు ,సిరి , గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి కృత్రిమ మేధ ఆధారిత వ్యక్తిగత సహాయక యాప్‌లు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ స్పీకర్లు,ఫ్లైట్ ఆలస్యాన్ని అంచనా వేయడం…మొదలైన అనేక రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారు.ఇవన్నీ మానవ జీవితాన్ని చాలా సులభతరం మరియు సౌకర్యవంతంగా చేశాయి.

అయితే కృత్రిమ మేధ వల్ల మనిషి ఆలోచించనవసరం లేకుండానే గుర్తు పెట్టుకోకుండానే చాలా పనులు జరిగిపోతాయి. వినియోగించని శరీర భాగాలు క్రమంగా అంతరించిపోతాయని డార్విన్‌ చెప్పిన Survival of the Fittest అనే జీవశాస్త్ర సిద్ధాంతం ప్రకారం ఇప్పటికే కాలిక్యులేటర్లపై ఆధారపడుతూ నోటి లెక్కలు వేయగల సామర్థ్యాన్ని కోల్పోతున్న కొత్త తరం ఇకపై కృత్రిమ మేధపై ఆధారపడుతూ వస్తుంటే మానవ మేధస్సు కుచించుకుపోయిన మానవ జాతిపై , మేధస్సు గల రోబోలు ఆధిపత్యం చెలాయించే రోజులు రావచ్చని న్యూరాలింక్ సృష్టికర్త ఎలాన్ మస్క్ లాంటి వారు అభిప్రాయ పడుతున్నారు.సాంకేతిక అభివృద్ధిని అంగీకరిస్తూనే, భద్రతను కాపాడుకుంటూ, ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలనేది సమాజంలోని అన్ని వర్గాలు ఎదుర్కొంటొన్న ప్రశ్న..కృత్రిమ మేధ ప్రయోజనాలు, ప్రమాదాల గురించి ఇప్పుడు సమాజంలో ఎగతెగని చర్చ జరుగుతోంది. కొందరు దీన్ని సాంకేతిక వరంలా చూస్తుంటే, మరి కొందరు సామాజిక సంక్షోభంగా భావిస్తున్నారు.

ప్రస్తుతమున్న డిజిటల్ యుగంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది.అన్ని రంగాల తో పాటుగా కృత్రిమ మేధస్సు భాషల వాడుకపైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భాషా అభ్యాసన విధానాలను మారుస్తోంది, కృత్రిమ మేధస్సుతో చేతిరాతను గుర్తించొచ్చు. అక్షరాల ఆకృతిని అర్థంచేసుకొని.. ఎలా రాసినా చదవగలగే, స్క్రిప్టును ఎడిటింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది.మొత్తానికి కృత్రిమ మేధ అనేది భాషలను ఈ విధంగా ప్రభావితం చేస్తుంది? కృత్రిమ మేధ సహాయంతో భాషలను ఏ విధంగా సుసంపన్నం చేయవచ్చు ? అసలు దీని ఆవశ్యకత ఏమిటి? దానిలో మనకున్న అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి?

Join Zoom Meeting Registration Link :
Join Zoom Meeting Link

Meeting ID: 999 8115 6774
Passcode: 747591