LOANS – మహిళలకు వడ్డీ లేని రుణాలు – భట్టి

BIKKI NEWS (JULY 05) : ZERO INTEREST LOANS FOR WOMEN. ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

ZERO INTEREST LOANS FOR WOMEN

ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జూలై 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చేస్తామని తెలిపారు.

మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించేలా అనేక మార్గాల్లో ముందడుగు వేస్తున్నామని తెలిపారు.

RTCతో భాగస్వామ్యంలో మహిళా సంఘాలు బస్సులు కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతున్నారని గుర్తు చేశారు.

ప్రజాభవన్‌లో మహిళా సంఘాలకు మంత్రులు శ్రీమతి సీతక్క గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి RTC అద్దె చెక్కులను అందజేయడం జరిగింది.

విద్యుత్ శాఖతో ఒప్పందం ద్వారా మహిళా సంఘాలచే సోలార్ పవర్ ఉత్పత్తి – లక్ష్యం 1,000 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పాఠశాలలు, క్యాంటీన్లు, స్కూల్ యూనిఫామ్‌ల తయారీ వంటి ప్రభుత్వ పనులు మహిళలకే అప్పగిస్తూ, వారికి ఉపాధిని కల్పిస్తున్నామని తెలిపారు

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో.. మొదటి ఏడాదిలోనే రూ. 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలుగా పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కనీసం రూ. 20,000 కోట్లు మహిళా సంఘాలకు ఇవ్వాలన్నదే మా సంకల్పమని భట్టి తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు