BIKKI NEWS (MARCH 09) : కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం విజయవంతంగా (ZERO ELECTRICITY BILLS UNDER GRUHA JYOTHI SCHEME) పేద ప్రజలకు ఉపయోగపడుతుంది
గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం
కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఈ తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు
ప్రజాపాలన లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్ ను సరిగ్గా పొందు పరిచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల జిరో బిల్లు వచ్చిందన్నారు. దరఖాస్తులో పొరపాటున తప్పులు పడిన వారు వెంటనే ఎంపిడివో కార్యాలయం వెళ్లి అక్కడ ఉన్న ప్రజపాలన అధికారికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన తరువాత జీరో బిల్లు వస్తుంది.