NEET PG : నీట్ పీజీ కౌన్సెలింగ్ లో సున్నా కటాఫ్ మార్కులు

హైదరాబాద్(సెప్టెంబర్ – 21) : నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్ లో మూడో రౌండ్ సీట్ల ఎంపికలో అర్హత మార్కులను సున్నాగా (నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు) పేర్కొంటూ (zero cut off marks in neet pg medical counseling 3rd phase 2023) మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ రౌండ్లో సీట్ల భర్తీకి అన్ని కేటగిరీలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. కటాఫ్ మార్కులను తొలగించిన నేపథ్యంలో మూడో రౌండ్లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది.

ఇప్పటికే మూడో రౌండ్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మార్చుకోవాలంటే మాత్రం తాజాగా మార్పు చేసుకోవచ్చని సూచించింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు అర్హత పరీక్షల మార్కులను సున్నాకు తగ్గించామంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగు ఈ సంవత్సరం కటాఫ్ మార్కులను 291గా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257గా, దివ్యాంగులకు 274గా కటాఫ్ మార్కులుగా పేర్కొని మొదటి రెండు రౌండ్లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు.

తాజాగా అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు పొందినా కూడా కౌన్సెలింగ్ కు అర్హత ఉన్నట్లుగా నిబంధనలు మార్చారు.