హైదరాబాద్ (సెప్టెంబర్ 07) : ఓబీసీ, ఈబీసీ, సంచార జాతుల పిల్లలను ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్స్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (యశస్వీ) ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సెప్టెంబర్ 11 వరకు పెంచుతున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
దేశవ్యా ప్తంగా ఈ నెల 25న అర్హత పరీక్షను ఆన్లైన్ లో నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ చూపిన వారికి తొమ్మిది, పది తరగతులు చదివేందుకు ఏడాదికి రూ.75వేలు, ఇంటర్మీడియటకు రూ.1.25లక్షల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు.
వెబ్సైట్ : yet@nta.ac.in