“కేసీఆర్ కి మహా క్షీరాభిషేకం” కార్యక్రమం మీద యార కుమార్ ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలంగాణ రాష్ట్రంలోని ఒప్పందం జూనియర్ అధ్యాపకుల తరపున కేసీఆర్ కి “మహా క్షీరాభిషేకం” కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆర్జేడీ నియమిత కాంట్రాక్టు లెక్చరర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యార కుమార స్వామి తో ప్రత్యేక ఇంటర్వ్యూ…

★ కేసీఆర్ కు మహా క్షీరాభిషేకం ఎందుకు.?

ఒప్పంద అధ్యాపకులు బదిలీలు లేక 13 సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ బదిలీలు జరుపమని ఆదేశాలు.. ఇవ్వడం చాలా సంతోషందాయకం అలాగే నూతన నోటిఫికేషన్ల ద్వారా వేలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తునే కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేసే పోస్టులను ఖాళీలు చూపించకుండా ఉన్నందుకు, 12 నెలలు ఒక్క రోజు కూడా సర్విస్ బ్రేక్ లేకుండా బేసిక్ పే 37,100 వేతనం ఇస్తునందుకు పాలాభిషేకం చేస్తున్నాం.

★ బదిలీలు నిజంగా కోరుకునే వారు సంఖ్య పై మీ సమాచారం.?

2018 సంవత్సరంలో “కుటుంబాల ఘోష” పేరుతో బదిలీలపై ఇదే ఇంటర్ కమిషనరేట్ లో భారీ సభ పెట్టినప్పుడు దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల మధ్య కాంట్రాక్టు అధ్యాపకులు హాజరై సభను విజయవంతం చేశారు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాధితుల సంఖ్య, బాధ పెరిగిందే కానీ తగ్గలేదు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు దాదాపు 3 వేల మంది బదిలీ బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.

★ బదిలీలు జరగకముందే క్షీరాభిషేకం ఎందుకు.?

బదిలీల సమస్య న గుర్తించి ఈ ప్రక్రియను ప్రారంభించమని విద్యా శాఖ అధికారులను ఆదేశిస్తూ కెసిఆర్ గారు హామీ ఇవ్వడమే మాకు సంతోషదాయకం. ప్రస్తుతం బదిలీల ప్రక్రియ జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.

★ మిత్ర సంఘాల మద్దతు ఉందా.?

మిత్ర సంఘాల మద్దతు కోరాం‌, బదిలీ బాధితుల కష్టాలు గుర్తించి మద్దతు ఇస్తే సంతోషం. నాకు ఉన్న సమాచారం మేరకు వారు స్పష్టమైన వైఖరిని ఇంతవరకు అధికారికంగా గానీ, అనధికారికంగా గాని వెల్లడించలేదని సమాచారం. ఇది బదిలీల పై వారికున్న చిత్తశుద్ధి కి సంబంధించిన విషయం.

బదిలీల కోసం పాదయాత్ర చేసి పట్టుమని పది మందిని సమీకరించకుండా పాదయాత్ర చేసి ఇప్పుడు బదిలీల మీద స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వ అనుకూల సంఘం ఒకటి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని అవహేళన చేస్తున్నారు. రేపటి మహా క్షీరాభిషేకం కార్యక్రమంతో వారు వేసుకున్న ముసుగులు తొలగిపోతున్నాయి.

★ ఐదు సంవత్సరాలు, విల్లింగ్ బదిలీల పై మీ వైఖరి ఏమిటి.?

అసలు ఒక ఉద్యోగి విధి నిర్వహణలో బదిలీలు అనేవి సర్వసాధారణం. దానికి ఉద్యోగి వ్యతిరేకం, అనుకూలం అనే వాదనే ఉండదు. కానీ ఇక్కడ బదిలీ వ్యతిరేకంగా మెజారిటీ సభ్యులు ఉన్నారు అని ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చి బదిలీలను గందరగోళంలో పడవేయడంలో సఫలీకృతం అయిన మిత్ర సంఘాలు అందూలో 10% కాంట్రాక్టు లెక్చరర్ ల ప్రయోజనాల మీద దృష్టి పెడితే ఎంతో లాభం జరిగేది.

అలా కాకుండా అనుకూలంగా ఉన్న చోటనే తిష్ట వేయాలని సొంత స్వార్థ ప్రయోజనాల కోసం బదిలీలు ఆపి వేలాదిమంది కన్నీటిని కారణం అయినారు. అయినా కచ్చితంగా బదిలీలు జరిగే తీరుతాయి. సంఘాలుగా ఎవరి అభిప్రాయం వారు చెప్పే హక్కు ఉంటుంది. కానీ తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. అయితే ఏ సంఘం ఏ నిర్ణయం చెప్పిన ప్రభుత్వం, విద్యా శాఖ వ్యవస్థకు ఏది మంచిదో అదే చేస్తారు.

★ ప్రస్తుతం బదిలీల పై మీకున్న సమాచారం.?

ముఖ్యమంత్రి గారి నిర్ణయమే ఫైనల్. వంద శాతం బదిలీలు జరుగుతాయి. ఇందులో ఎలాంటి సందేహలకు తావులేదు. ముఖ్యమంత్రి గారునిర్ణయం తీసుకున్న తర్వాత బదిలీలు నాకు వద్దు అనే హక్కు ఏ ఉద్యోగికి లేదు. స్థానికంగా ఉండి స్వార్థ ప్రయోజనాలు పొందడం కోసమే బదిలీలు వద్దు అంటున్నారు.

★ ఇతర సమస్యల పై మీ సంఘ వైఖరి ఏమిటి.?

క్రమబద్ధీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం. 20 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లక్షకుపైగా అడ్మిషన్లను సాధించడంలో ఒప్పంద అధ్యాపకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ప్రతి హక్కును సాధిస్తాం. దానికి తగ్గ కార్యాచరణ బదిలీలు ముగిసిన తర్వాత ప్రత్యేకంగా ప్రకటిస్తాం.

★ క్షీరాభిషేకం కార్యక్రమం తర్వాత మీ కార్యచరణ.?

క్షీరాభిషేకం చేసిన తర్వాత తప్పుడు సమాచారంతో మంత్రి స్థాయి వ్యక్తులను కూడా తప్పుదారి పట్టించి బదిలీలపై నీలినీడలు కల్పించిన స్వార్థ శక్తుల గుట్టు రట్టు చేసి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే బదిలీలు జరిపించడమే మా ప్రధాన లక్ష్యం.
“బదిలీలు సాధించడమే కాదు భద్రతకు ఇది పునాది కానుంది.”

2018 సంవత్సరంలో “కుటుంబాల ఘోష” పేరుతో బదిలీలపై ఇదే ఇంటర్ కమిషనరేట్ లో భారీ సభ పెట్టినప్పుడు దాదాపుగా పదిహేను వందల నుండి రెండు వేల మధ్య కాంట్రాక్టు అధ్యాపకులు హాజరై సభను విజయవంతం చేశారు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాధితుల సంఖ్య, బాధ పెరిగిందే కానీ తగ్గలేదు.

యార కుమార్
Follow Us @