యాదాద్రి పేరు యాదగిరిగుట్ట గా మార్పు – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (NOV. 09) : Yadadri now Yadagiri gutta. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) తరహాలో ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి గారు సమీక్షించి పలు సూచనలు చేశారు.

Yadadri now Yadagiri gutta

చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ దేవస్థానాన్ని యాదాద్రికి బదులుగా భక్తులు పిలుచుకునే విధంగానే అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగానే వ్యవహారికంలోకి తీసుకురావాలి.

గోశాల నిర్వహణకు ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలి. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలి.

గతంలో ఉన్నట్టుగానే భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి.

విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాలి.

ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి వీలుగా నిధుల మంజూరు.

వారం రోజుల్లో పూర్తి వివరాలు, ప్రతిపాదనలు తయారు చేయాలి. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు