WTC FINAL 2023 : పోరాడుతున్న టీమిండియా

లండన్ – ఓవల్ (జూన్ – 10) : World Test Championship Final – 2023 టైటిల్ కోసం రికార్డు పరుగుల చేధనలో భారత బ్యాట్స్‌మన్ లు పూర్తి సానుకూల దృక్పథంతో పోరాడుతున్నారు. 443 పరుగుల భారీ టార్గెట్ ను ఉఫ్ మని ఊదేలా 4వ ఇన్నింగ్స్ లో ఆట ఆరంభించారు. ఆట ముగిసే సమయానికి భారత్ 164 /3 వికెట్లతో ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (44*), అజింక్యా రహనే 20*) ఉన్నారు.

ఐదో రోజు ఆటలో భారత్ గెలవాలంటే 280 పరుగులు కావాలి, ఆస్ట్రేలియా గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంటుంది.

అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 270/8వద్ద డిక్లర్ చేసి భారత్ ముందు 443 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లలో అలెక్స్ క్యారీ (66), లబూషెన్ (41) రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ 2 వికెట్లు తీశారు.

443 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (43) , శుభమన్ గిల్ (18), పూజార ( 27) ధాటిగా ఆడిన వికెట్లు సమర్పించుకున్నారు. శుభమన్ గిల్ ఔట్ విషయంలో సందిగ్ధం ఉంది. అనంతరం విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే వికెట్ కోల్పోకుండా విజయవకాశాలను ఉంచారు. ఐదో రోజు భారత్ మిడిలార్డర్ మీదే భారం ఉంది.