లండన్ – ఓవల్ (జూన్ – 10) : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ – 2023 మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. మూడవరోజు భారత బ్యాట్స్‌మన్ రహానే, శార్దుల్ ఠాకూర్ నిలువరించడంతో భారత జట్టు 296 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 123 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆట మూసే సమయానికి 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉండడంతో ఫలితం కచ్చితంగా తేలనుంది.
మూడో రోజు ఆట ప్రారంభంలోనే భరత్ అవుట్ కావడంతో వికెట్ల పతనం తప్పదు అనుకున్నారు. కానీ రహానే, శార్దుల్ ఠాకూర్ విరోచితంగా పోరాడారు. రహనే 89 పరుగుల వద్ద, శార్దూల్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
ఈ క్రమంలో భారత తరఫున టెస్ట్ ఫార్మేట్ లో 5,000 పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాట్స్‌మన్ గా రహానే రికార్డు సృష్టించాడు. అలాగే ఓవెల్ మైదానంలో టెస్టుల్లో వరుసగా మూడు అర్థ శతకాలు సాధించిన శార్దుల్ ఠాకూర్ రికార్డు సృష్టించి డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్ సరసన నిలిచాడు.