ప్రపంచ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ న్యూజిలాండ్

  • న్యుజిలాండ్ కి ఇదే మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం.
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ :: కైల్ జెమిసన్
  • కెప్టెన్ గా కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా నెగ్గలేదు
  • 2013 తర్వాత టీమిండియా కి దక్కని ఐసీసీ ట్రోఫీ
  • ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ హోదా కోల్పోయిన టీమిండియా

ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ ఛాంపియన్ షిప్ కోసం టాప్ టూ జట్ల మద్య ఇంగ్లండ్ వేదికగా నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ 2021 మ్యాచ్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పోటీపడగా న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (52*) కెప్టెన్ ఇన్నింగ్స్ తో మొదటి మరియు రెండవ ఇన్నింగ్స్ లలో రాణించడంతో కివీస్ విజయం నల్లేరు మీద నడక అయింది.

వాతావరణం అనుకూలించని నేపథ్యంలో ఒకరోజు అదనంగా రిజర్వు డేను కూడా ఈ మ్యాచ్ కోసం ఐసిసి కేటాయించింది. ఈ మ్యాచ్ లో పలు సార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ న్యూజిలాండ్ భారత్ ను చిత్తు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 139 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకని సగర్వంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కప్ (గద) ను అందుకుంది. ఇప్పటిదాకా భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్ గా ఉండగా ఇప్పటినుండి అయినా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.

★ విలియమ్సన్ – టేలర్ విన్నింగ్ భాగస్వామ్యం

అశ్విన్ రెండు వికెట్లతో రెచ్చిపోతున్న వేళ ఆ ఇద్దరు విలియమ్సన్, టేలర్(47*) భారత బౌలింగ్ దాడికి అడ్డుగా నిలిచి ఓపిక, నైపుణ్యం జోడించి కివీస్ ను విజయతీరాలకు చేర్చారు…

★ టెస్ట్ క్రికెట్ కు తొలి రిజర్వు డే

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ టెస్ట్ మ్యాచ్ కు ఉపయోగించని రిజర్వ్ డే నిబంధన టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ నిర్వహించే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఒకరోజు రిజర్వ్ డేను ఐసీసీ కేటాయించింది. అదే ఇప్పుడు ఫలితాన్ని నిర్ణయించింది. రిజర్వ్ డే లేకపోతే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేది. మొదటి సారి ఉపయోగించిన నిబంధన మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం విశేషం.

ఇండియా మొదటి ఇన్నింగ్స్ – 217/10

న్యుజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ – 249/10

ఇండియా రెండవ ఇన్నింగ్స్ – 170/10

న్యుజిలాండ్ రెండవ ఇన్నింగ్స్ – 140/2