కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగుల పట్ల మహిళా దినోత్సవం సాక్షిగా పక్షపాతం.

మహిళలు ఆకాశంలో సగం, మహిళలకు పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా నినాదాలకె పరిమితమైన మహిళల హక్కులు అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా వినిపించే హక్కులు నేటికి అమలు కాకపోవడం విచారకరం.

మహిళల మీద పక్షపాతం ప్రపంచ మహిళా దినోత్సవం నాడు కూడా తెలంగాణ ప్రభుత్వం చూపెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ను మార్చి 8 – న GO MS NO 433 dated 04-08-2010 ప్రకారం మహిళా దినోత్సవం నాడు కల్పించిన విషయం తెలిసిందే. అయితే వేలాది మందిగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ మరియు వివిధ రకాల తాత్కాలిక మహిళా ఉద్యోగులకు ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అవకాశం సంబంధిత శాఖ అధికారులు కల్పించకపోవడం విచారకరం.

తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు గవర్నర్ శ్రీ తమిళసై ఒక మహిళ కావడం విశేషం. అలాగే మహిళా మంత్రులు కూడా ఉన్నారు. రెగ్యులర్ మహిళా ఉద్యోగులతో సమానంగా ఎలాంటి బెనిఫిట్స్ పొందని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులు కనీసం మహిళా దినోత్సవం నాడు ప్రభుత్వం కల్పించిన స్పెషల్ క్యాజువల్ లీవ్ కల్పించాలని మహిళా ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.

మహిళలు ఆకాశంలో సగం, మహిళలకు పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా నినాదాలకె పరిమితమైన మహిళల హక్కులు అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా వినిపించే వాక్కులు నేటికి అమలు కాకపోవడం విచారకరం.

– టి. మాలతి

అమ్మతనం అనేది రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు మాత్రమేనా కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమ్మతనం వద్దా….. రెగ్యులర్ వారికి ఆరునెలలపాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఇతర తాత్కాలిక మహిళా ఉద్యోగులకు శాఖల వారీగా 30 రోజులు, 60 రోజులు వేతనం లేకుండా ప్రసూతి సెలవులు ఉండటం అమ్మతనానికి అవమానంగా మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు.

టి. మాలతి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు TGCCJLA (711) – యూనియన్