ఇంటర్విద్యా జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యలో పని చేస్తున్న మహిళా అధ్యాపకురాళ్ళు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇంటర్ విద్యార్థి జేఏసీ నిర్వహించిన ఈ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళా అధ్యాపకురాళ్ళు హజరయ్యి ఈ వేడుకలను విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. తధనంతరం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, తాను కూడా మహిళను అయినప్పటికీ రాజకీయంగా రాణిస్తున్నాని, మహిళలు ఏ విషయంలోనూ మగవారికి తీసిపోరని, విద్య ద్వారా నూతన ప్రపంచాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర కీలకమని కావున అధ్యాపకురాళ్ళు నూతన సమాజ నిర్మాణానికి తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల 711 సంఘం సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారని, అవని నుండి ఆకాశం వరకు అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అలాగే మహిళా కాంట్రాక్ట్ అధ్యాపకురాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం చేత సంఘం తరపున పూర్తి చేయించుకుంటామని.. ముఖ్యంగా కుటుంబాలకు దూరంగా ఉంటున్నా మహిళా అధ్యాపకురాళ్ళకు బదిలీలు, రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా ఆరునెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, సాధారణ సెలవులు సాధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 711 సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో లో హైదరాబాద్ జిల్లా 711 సంఘం అధ్యక్షురాలు మాలతి, కళా స్వరూప‌, గంగ, సునీత, శోభ, స్వప్న, రాణి, సంధ్య, స్వర్ణ, సునీత, ముబీనా తదితరులు పాల్గొన్నారు.

Follow Us@