Home > TODAY IN HISTORY > World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం

World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం

BIKKI NEWS (MARCH 22) : WORLD WATER DAY ON MARCH 22nd. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఏటా మార్చి 22 న ఐక్యరాజ్య సమితి జరుపుతుంది ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు.

WORLD WATER DAY ON MARCH 22nd

1992 బ్రెజిల్ లోని రియో డి జనీరోలో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సమావేశం (UNCED) ఎజెండా 21లో ఈ దినోత్సవాన్ని మొదట ప్రతిపాదించారు. తొలి ప్రపంచ నీటి దినోత్సవం 1993లో జరిగింది.

World Water Day 2025 is “Glacier Preservation,””

మార్చి 22న ప్రపంచమంతా ప్రపంచ నీటి దినోత్సవం దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీటిని సంరక్షించడం ప్రాముఖ్యత గురించి సమాజములో అవగాహనను పెంచడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1993 లో ఈ రోజుగా ప్రకటించింది. 1992 సంవత్సరంలో రియో డి జనీరోలో జరిగిన ” యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ” షెడ్యూల్ 21 లో మొదటిసారిగా దీనిని అధికారికంగా ప్రతిపాదన చేయడం జరిగింది.

భారత్ లో నీటి నిర్వహణ

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2019 లో జల్ శక్తి అభియాన్ ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, ఉద్దేశించింది. దీనిని 2019 జూలై 1 నుంచి 2019 సెప్టెంబరు 30 వరకు, 2019 అక్టోబరు 1 నుంచి 2019 నవంబరు 30 వరకు రెండు దశల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నీటి సంరక్షణ, వర్షపునీటి సంరక్షణ నిర్మాణాల నిర్మాణం, నిర్వహణ, వివిధ సంప్రదాయ జలవనరుల చెరువుల పునరుద్ధరణ, బోరుబావుల పునర్వినియోగం, రీచార్జి, వాటర్ షెడ్ అభివృద్ధి, ముమ్మర అడవుల పెంపకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించకపోతే, రాబోయే కొన్నేళ్లలో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరో 20 నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతాయని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిని నివారించడానికి ఏకైక పరిష్కారం, నీటి సంరక్షణ ఉన్న అన్ని పద్ధతులను అవలంబించడం, గృహముల నుంచి అడవుల వరకు మానవులు నీటి సంరక్షణ చేయడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత స్థాయిలో చేసి నీటి సంక్షోభం నుంచి నివారణే దీనికి మార్గం

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు