సముద్రాలు – ఉనికి – విశిష్టత

★ నల్ల సముద్రం :- ఆగ్నేయ యూరప్ లో ఉంది.

★ దక్షిణ చైనా సముద్రం :- పసిఫిక్ మహాసముద్రంలో భాగం. ప్రపంచంలో అతి పెద్ద సముద్రం. టైఫూన్లకు కేంద్రం.

★ మధ్యధరా సముద్రం :- ఐరోపా, ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య ఉంది. దాదాపు మొత్తం భూ పరివేష్టిత సముద్రం

★ బ్యూఫోర్ట్ సముద్రం :- ఆర్కిటిక్ మహాసముద్రం (కెనడా)లో భాగం.

★ బేరింగ్ సముద్రం :- పసిఫిక్ మహాసముద్రానికి ఉత్తరాన ఆసియా, ఉత్తర అమెరికాల మధ్య ఉంది.

★ కరేబియన్ సముద్రం :- దక్షిణ అమెరికా, క్యూబాల మధ్య ఉంది.

★ నార్వేజియన్ సముద్రం :- ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉంది.

★ తెల్ల సముద్రం :- వాయవ్య రష్యాలో ఉంది. ఈ సముద్రం మొత్తం రష్యా ఆధీనంలో ఉంది.

★ అడ్రియాటిక్ సముద్రం :- మధ్యధరా సముద్రానికి కొనసాగింపు. ఇటలీ, బాల్కన్ ద్వీపకల్పం మధ్య ఉంది.

★ ఎర్ర సముద్రం :- భూపరివేష్టిత సముద్రం. ఆసియా, ఆఫ్రికాల మధ్య విస్తరించి ఉంది.

★ కాస్పియన్ సముద్రం :- ప్రపంచంలో అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. యూరప్, ఆసియా సరిహద్దుల్లో విస్తరించి ఉంది.

★ జపాన్ సముద్రం :- జపాన్, తూర్పు ఆసియా మధ్య ఉంది.

★ తూర్పు చైనా సముద్రం :- పసిఫిక్ మహా సముద్రంలో భాగం.

★ జావా సముద్రం :- పసిఫిక్ మహాసముద్రంలో భాగం. ఇండోనేసియా ద్వీపాలైన బోర్నియా, జావా, సుమత్రాల మధ్య ఉంది.

★ ఎల్లో సముద్రం :- చైనా, ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉంది.

★ అరల్ సముద్రం :- ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ మధ్య ఉంది.

★ లాబ్రడార్ సముద్రం :- గ్రీన్ లాండ్, కెనడాల మధ్య ఉంది.

★ టాస్మాన్ సముద్రం :- పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూజిలాండ్ మధ్య ఉంది.

★ అరేబియా సముద్రం :- హిందూ మహా సముద్రంలో బాగం. భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఒమన్ గల్ఫ్ సరిహద్దులు

★ బంగాళాఖాతం :- హిందూ మహా సముద్రంలో బాగం. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్, అండమాన్ నికోబర్ దీవుల మద్య ఉంటుంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @