ఆగస్టు 20 చరిత్రలో ఈరోజు

◆ దినోత్సవం :

  • మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
  • సద్భావనా దినోత్సవం (రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా)

◆ సంఘటనలు :

1897: మలేరియా వ్యాధి ‘ఎనాఫిలాస్’ అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజు

2015 – తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.

◆ జననాలు :

1833: బెంజమిన్ హారిసన్, అమెరికా 23వ అధ్యక్షుడు. (మ.1901)
1858: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. (మ.1931)
1920: రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
1927: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (మ.2005)
1928: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994)
1931: బి.పద్మనాభం, తెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
1935: సి. ఆనందారామం, కథా, నవలా రచయిత్రి.
1935: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (మ.2016)
1944: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991)
1946: ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు.
1947: వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015)
1974: ఏమీ ఆడమ్స్, అమెరికా దేశానికి చెందిన నటి, గాయకురాలు.

◆ మరణాలు :

1923: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1856)
1930: చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (జ.1851)
2012: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (జ.1925)
2014: మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌, పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.

Follow Us @