BIKKI NEWS (NOV – 21) : ప్రపంచ మత్స్య దినోత్సవంను (World Fisheries Day) ప్రతి సంవత్సరం నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మత్స్యకారులకు గుర్తింపును అందించడంకోసం, మత్స్య పరిశ్రమకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతో ఆరోగ్యకరమైన సముద్ర పర్యావరణ వ్యవస్థల ప్రాముఖ్యతను తెలియపరచడానికి మత్స్యకార సంఘాలు ఈ దినోత్సవం నిర్వహిస్తాయి.
1997లో న్యూఢిల్లీ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత్య్సకారులు, వ్యాపారస్తులు సమవేశమై దీనిపై సుదీర్షంగా చర్చించారు. 1998లో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో పాల్గొన్న అన్ని దేశాల ప్రతినిధుల సమక్షంలో ప్రతి సంవత్సం నవంబరు 21ని ప్రపంచ మత్య్స దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆ సదస్సు వేదికగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలుపునిచ్చాడు. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఆమోదించి, నవంబరు 21న ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి