WORLD ENVIRONMENT DAY – ప్రపంచ పర్యావరణ దినోత్సవం

  • The theme of World Environment Day 2024 is ‘land restoration, desertification, and drought resilience‘.
  • “Solutions to Plastic Polution” థీమ్ తో 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతున్నారు.
  • ‘ఓన్లీ వన్‌ ఎర్త్‌’ థీమ్‌తో 2022 ప్రపంచ పర్యావరణ దినోత్సవం

BIKKI NEWS : (జూన్ – 05) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) ను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) దినోత్సవం జరుపుతుంది.

1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయింది. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడింది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్ 5 తేదిన అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు.

2022 జూన్ 5తో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబరాలకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. తొలిసారిగా స్వీడన్‌ లో 1972వ సంవత్సరం ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో వాతావరణ మార్పులను గమనిస్తూ తగు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని గుర్తించారు. 1973 నుంచి జూన్‌ 5న ప్రతియేటా ప్రపంచ పర్యావరణ దినం విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఐరాస ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూవస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్‌ ఎర్త్‌’ థీమ్‌తో 2022 లో పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. land restoration, desertification, and drought resilience‘.” థీమ్ తో 2024 ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుతున్నారు.గ్రీన్‌ లైఫ్‌ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కార్యక్రమాన్ని స్వీడన్ నిర్వహిస్తోంది.