హైదరాబాద్ (నవంబర్ – 16) : ICC CRICKET WORLD CUP 2023 GRAND FINALS కు భారత్ ఆస్ట్రేలియా జట్లు (WORLD CUP FINAL 2023 INDIA vs AUSTRALIA) చేరుకున్నాయి. ఈ రెండు జట్లు నవంబర్ 19న జరిగే ఫైనల్ లో తలబడనున్నాయి.
ఇప్పటికే 5 సార్లు ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలువగా, భారత్ 2 సార్లు విశ్వవిజేతగా నిలిచింది.
2003 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు ఫైనల్ తలబడదాం ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ వరల్డ్ కప్ లో భారత్ ఓడిన మ్యాచులు రెండే రెండు. అవి రెండు కూడా ఆస్ట్రేలియా మీద లీగ్ మరియు ఫైనల్ మ్యాచ్ లు కావడం విశేషం.
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచి ఫైనల్ కు చేరగా, సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ఫైనల్ కు చేరింది.