ADMISSIONS : ఉద్యోగం చేస్తూ.. ఇంజినీరింగ్ అడ్మిషన్లు

హైదరాబాద్ (నవంబర్ 12) : మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి పెట్టకుండా, ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బీటెక్ చదువుకోవచ్చు. ఇలాంటి వారికి బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు (WORKING PROFESSIONALS ADMISSIONS IN BTech 2nd Year) కల్పిస్తారు. ఈ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్రంలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ఇటీవలే అనుమతిని ఇచ్చింది.

ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ప్రవేశాలు కల్పించేందుకు (AICTE ) అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్ ప్రోఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వంటి ప్రోగ్రాముల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు ప్రవేశాలు కల్పిస్తారు.

నిబంధనలు

  • మూడేండ్ల పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తిచేసిన వారికి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు.
  • అడ్మిషన్లు కల్పించేందుకు ప్రవేశ పరీక్షను కాలేజీలోనే నిర్వహిస్తారు.
  • సాయంత్రం లేదా వారాంతాల్లో అడ్మిషన్ పొందిన కాలేజీల్లో తరగతుల నిర్వహణ.
  • ఫీజులను కాలేజీలే నిర్ణయిస్తాయి. * ఓయూలో సంవత్సరానికి రూ. 1 లక్షగా ఖరారు చేశారు.

తెలంగాణలో అనుమతులు పొందిన కాలేజీలు

1) మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ,
2) ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్,
3) మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ,
4) స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ,
5) తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ,
6) వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ,
7) చైతన్యభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
8) జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,
9) మాటూరి వెంకటసుబ్బారావు ఇంజినీరింగ్ కాలేజీ,
10) కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ – కొత్తగూడెం,
11)-అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్,
12) అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ