ఇప్పటి వరకు ఉపగ్రహాలను సాదరణంగా అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా లేదా అలాగే, ఇవి అంతరిక్షంలోనే మిగిలిపోయినా పర్యావరణానికి ఇబ్బంది.
ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో వాటి పని పూర్తి అయినా కూడా అక్కడే ఉండిపోయాయి. వీటినే ‘స్పేస్జంక్’ అంటున్నారు.
ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకే జపాన్లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటిమో ఫారెస్ట్రీ నిపుణులు కలపతో ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో కొద్ది భాగాలను మాత్రమే అల్యూమినియంతో చేశారు. ఈ కలప ఉపగ్రహన్ని 2023లో అంతరిక్షంలోకి పంపనున్నారు.
ప్రపంచంలోనే ఇది తొలి కలప ఉపగ్రహం. నిర్దేశించిన పని పూర్తి చేసుకున్నాక, ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే కాలి బూడిదైపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
Follow Us @