మల్కాజిగిరి (మార్చి – 09) : ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజిగిరిలో డాక్టర్ ఎం. గోపి సార్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటిగా కళాశాల ప్రిన్సిపాల్ మేడం జ్యోతిర్మయి గారిని మహిళ అధ్యాపకురాలందరు శాలువా తో సత్కరించారు,తదనంతరం ప్రిన్సిపాల్ గారు కళాశాలలో ఉన్న మహిళ అధ్యాపకురాలు అందరిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గోపి,పరశురాం మాట్లాడుతూ మన కళాశాలలో ఉన్నటువంటి మహిళ అధ్యాపకురాలను అందరిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని,మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంతోషి,లక్ష్మి, శారద,హసీనా, పద్మజ,వాసంతి, హేమలత, విజయ భాస్కర్ రెడ్డి, జగన్ మరియు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.