47 శాతం ఉద్యోగాలు మహిళలకే – ప్రభుత్వ ప్రకటన

BIKKI NEWS (MARCH 11) : తెలంగాణ నూతన ప్రభుత్వంలో గడచిన మూడు నెలల్లో 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ప్రభుత్వం అందజేయడం జరిగిందని, అందులో 47% ఉద్యోగాలు మహిళలకు, 53% ఉద్యోగాలు పురుష అభ్యర్థులు పొందారని ప్రభుత్వం ఒక ప్రకటనలో (women got 47% of jobs in telangana) తెలిపింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.

స్టాఫ్ నర్స్ పోస్టులలో 88% మహిళలు, పోలీస్ నియామకాలలో 19 శాతం మహిళలు, గురుకుల నియామకాలలో 61 శాతం మహిళలు, టీఎస్పీఎస్సీ నియామకాల లో 41 శాతం మహిళలు ఉద్యోగాలు పొందినట్లు టిఎస్పిఎస్సి నివేదిక వెల్లడి చేసింది.

మహిళా రిజర్వేషన్లు ప్రకారం 33% కంటే ఎక్కువగానే మహిళలకు ఉద్యోగాలు దక్కాయని తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సూచనల ప్రకారం జీవో నెంబర్ – 3 ని విడుదల చేశామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.