డొమినికా (జూలై – 15) : భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించి 7 వికెట్లు తీయడంలో వెస్టిండీస్ జట్టు తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత తన మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్ (103), యశస్వి జైశ్వాల్ (171), కోహ్లీ (76) రాణించడంతో 421/5 వద్ద డిక్లర్ చేసింది.
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ను ఏ దశలోను కోలుకోకుండా భారత స్పిన్నర్ ఆశ్విన్ (7), జడేజా (2) వికెట్లతో 130 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (171) ఆడిన తొలి టెస్టులోనే భారీ శతకం నమోదు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.